5 May, 2026 | 9:33 AM

జీడిమెట్లలో సహజీవనం.. వ్యక్తి హత్య

05-05-2026 12:00 AM

కుత్బుల్లాపూర్, మే 4 (విజయక్రాంతి) : సహజీవనం చేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీ స్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా, గాలివీడు కు చెందిన శివారెడ్డి, అరుణ(44) అనే మ హిళతో గత పదేళ్లుగా చింతల్ అంబేద్కర్ నగర్‌లో సహజీవనం చేస్తున్నాడు. శివారెడ్డి రోజూ మద్యం తాగి వచ్చి మత్తులో అరుణ, ఆమె కుమారుడు సాయిరత్నంను వేదిస్తూ ఉండేవాడు.

దే క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దగా జరగడంతో ఇద్దరు కలిసి శివారెడ్డి గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి అర్థరాత్రి ఆటోలో తరలిస్తుండగా, సమాచా రం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.