నేడు తేలికపాటి వర్షాలు
23-07-2026 01:20 AM
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం కూ డా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఆది లాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడ క్కడ భారీ వర్షాలు కురువనున్నాయి.
ఈమేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎ ల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక బుధవారం ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలి కపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసిన ట్లు వాతావరణ శాఖ తెలిపింది.






