పాక్ ‘ఐఎస్‌ఐ’ దంపతుల అరెస్ట్
హనీట్రాప్‌తో భారత రక్షణ సమాచారం చోరీ
ఢిల్లీలో అదుపులోకి.. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు
అశ్లీల ఫొటోలు పంపి ఉన్నతాధికారులకు వల
న్యూఢిల్లీ, ఆగస్టు ౨౮: సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్‌కు పాల్పడుతూ భారత రక్షణశాఖ రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్న ఐఎస్‌ఐ నియమించుకున్న దంపతులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు తర్వాత పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. భారత్‌కు చెందిన సాహిల్ (25), సమీరా (21) కొన్నేళ్ల క్రితం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి కోవర్ట్‌లుగా మారారు. వీరు భారత రక్షణశాఖతోపాటు కీలక ప్రభుత్వశాఖల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు.
భారత్‌లో కొన్న సిమ్‌కార్డులు వినియోగించి సోషల్‌మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి వారికి అశ్లీల ఫొటోలు షేర్ చేస్తున్నారు. మాట కలిపిన తర్వాత, వారి బలహీనతలు తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. తద్వారా సున్నితమైన రక్షణశాఖ సమాచారాన్ని గుంజుతున్నారు. కొందరు ఉన్నతాధికారుల నుంచి సిమ్‌కార్డులు సేకరించి, తద్వారా కీలక వాట్సాప్ గ్రూప్‌ల్లో సభ్యులుగా చేరుతున్నారు. తద్వారా కూడా కీలకమైన రక్షణశాఖ రహస్యాలను తెలుసుకుని పాక్ చేరవేస్తున్నారు. ఏదైనా ఒక పేజీ రక్షణశాఖ సమాచారం అందిస్తే, ఒక నగ్న ఫొటో పంపుతామని ఆశ చూపి మే నెలలో ఓ భారత ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారిని లోబరుచుకున్నారు. నిందితులు 20౨౫ 25 మధ్య ఎనిమిది భారతీయ సిమ్ కార్డులను వినియోగించినట్టు దర్యాప్తులో తేలింది.






