calender_icon.png 8 February, 2026 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మాయ మాటలుకు మోసపోయాం.. మల్లొకసారి మోసపోవద్దు

08-02-2026 07:47:59 PM

కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం.. 

తాండూరు,(విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటలకు మోసపోయాం.. ఇగ మల్లొకసారి వారి మాటలను నమ్మకుండా కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మునిసిపల్ పై గులాబీ జెండా ఎగురవేద్దామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారరామారావు అన్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆయన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సాయి పూర్ నర్సింలు,  డాక్టర్ సంపత్ కుమార్ తదితర నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తూ ఇప్పుడు ఓట్లు అడిగే టందుకు వస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు నిలదీయాలని అన్నారు.

తాండూర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నర్సింగ్ కళాశాల ను మంజూరు చేయగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించారని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయకుండా రెండేళ్లుగా మాయమాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారు తప్పిస్తే ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు.వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని తాండూర్ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.