13 July, 2026 | 1:59 AM

పట్టుకోండి చూద్దాం..

13-07-2026 12:00 AM

పోలీసులకు దొంగల సవాల్ 

నిర్మల్ జులై 13 (విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో వరస దొంగతనాలు పోలీస్ శాఖకు సవాలుగా నిలుస్తున్నాయి. దొంగతనాలు ని యంత్రణకు పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన నిర్మల్ జిల్లాలో దొంగతనాలు మాత్రం ఆగకపోగా మరింత పెరగడం ప్రజలను ఆం దోళన ఆందోళన కలిగిస్తుంది. ఇందు గల డు.. అందు లేడు.. ఎందెందు వెతికినా అం తా దొంగతనమే అని రీతిగా నిర్మల్ జిల్లా దొంగతనాలకు అడ్డగా మారుతుంది. వరస దొంగతనాలు పోలీస్ శాఖకు సవాలుగా మారగా ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దొంగల పాలు కావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప ట్టణం, పల్లి, గుడి బడి, బస్టాండ్ దుకాణం, బస్సు, ఎక్కడైనా దొంగతనాలు,

ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకోవడం ప్రజలను ఎటు పోలీసులను కలవడానికి గురిచేస్తుంది. నిర్మల్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాలు ఇందుకు ప్ర త్యేకంగా చెప్పవచ్చు. తాజాగా నిర్మల్ పట్టణంలోని నిర్మల్ ఖానాపూర్ రహదారిని అ నుకుని ఉన్న తన్వి అపార్ట్మెంట్లో ఆదివారం అర్ధరాత్రి ఆరుగురు సభ్యులు గల దొంగల ముఠా అపార్ట్మెంట్లో చొరబడి రెండు ఇం డ్లను లూటీ చేశారు. దొంగలు పథకం ప్రకా రం ముందే రెక్కీ నిర్వహించి ఉంటారని తె లుస్తోంది.

అర్ధరాత్రి అపార్ట్మెంట్ ప్రధాన గే ట్లు తాళం షట్టర్ కట్టర్లతో తొలగించి రెండు ఫ్లాట్లోకి వెళ్లిన దొంగలు భక్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న బంగారం నగదును యదేచ్చగా దొంగిలించక పోయారు. 15 రోజుల క్రితం ఆదర్శనగర్‌లో ఇంట్లో తాళం పగలగొట్టి దొంగతనం చేశారు. బాసర ప్రధాన దుర్గామాత ఆలయం ఉండిని ధ్వంసం చేసి ఉం డితోపాటు వెండి కేటాన్ని దొంగిలించగా ఇ టీవలే పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇ టీవలె  బైంసా, ముధోల్ కుంటాల మాము డా లక్ష్మణ చందా కడెం పెద్దూర్ లోకేశ్వరం మండలాలు ఇండ్లతోపాటు దేవాలయాల దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. దీనికి తోడు , చైన్ స్నాచింగ్, ఉంటది మహిళలను టార్గెట్ గా చేసుకొని బంగారం వెండి ఎత్తుకెళ్లడం వంటి దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.

బస్టాండ్లలో పెరుగుతున్న చోరీలు

 నిర్మల్ బైంసా ఖానాపూర్ బస్టాండ్ లో జనం రద్దీ ఉన్నచోట బస్సు ఎక్కి ప్రయాణికుల నుండి బంగారం గొలుసులు పరుసు లు విలువైన ఇతర సామాగ్రిని దొంగలు దో స్కెళుతున్నారు. సెల్ ఫోన్ లో సైతం వదల డం లేదు. నెలరోజుల పది నుంచి పదిహేను దొంగతనాలు జరుగుతున్నట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులో రద్దీ ఎక్కువ కావడంతో చిన్నపిల్లలు, మహిళలు దొంగతనాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా వెండి బంగారం ధరలకు రెక్కలు రావడంతో కొందరు దొంగలు వాటినే టార్గెట్గా ఒంటరి మహిళ లక్ష్యంగా పెట్టుకొని గొలుసు దొంగతనాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం లక్షన్నర ఉండడంతో దొంగలు ఈ తరహా దొంగతనాలు చేస్తున్నారు.

బ్యాంకుల వద్ద డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తులను గుర్తించి డబ్బులు కాజేస్తున్నారు. ఇన్ని తరహాల దొంగతనాలు జరగడం పదేళ్లలో ప్రస్తుతం మొదటిసారి అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పోలి శాఖ దొంగతనాలను నియంత్రించేందుకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు గస్తీ టీమ్లు పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసిన దొంగలు వారి కళ్ళు కప్పి దొంగతనాలు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.

నిర్మల్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దులో ఉండటంతో మహారాష్ట్ర ముఠాతో పాటు ఇతర రాష్ట్రాల ముఠాలు ఈ ప్రాంతంలో ఇటువంటి దొంగతనాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దొంగతనాలు జరిగినప్పుడు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మరికొందరు చిన్న చిన్న దొంగతనం అయినప్పుడు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బస్టాండ్లో పర్సులు బ్యాగులు పోయినవారు జరిగిన నష్టం పట్ల లబోదిబోమంటూ ఇంటికి వెళ్లి పోతున్నారు. ఇప్పటికైనా వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండి వాటిని నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.