13 July, 2026 | 1:04 AM

పని చేస్తున్నాం.. ప్రచారం ప్రజలే చేయాలి

13-07-2026 12:00 AM

కాంగ్రెస్ గూటికి ఫత్తేపూర్, వేపూర్ సర్పంచులు

1000 మంది వివిధ పార్టీల కార్యకర్తలు పార్టీలో చేరిక

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ జూలై 12 (విజయక్రాంతి): ప్రజలకు మంచి చేయడం తమకు తెలుసని..ప్రచారం ప్రజలే చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఫత్తేపూర్, వేపూర్ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఊర చెరువు కట్ట పైన ఏర్పాటు చేసిన ఐ లవ్ ఎదిరలోగోను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం ఈ  రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుతం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, తమతమ గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలని భావించి హన్వాడ మండలంలోని వేపూర్ గ్రామ సర్పంచ్ నాయికోట చెన్నయ్య, మరియు వార్డు సభ్యులు, మహబూబ్ నగర్ మండలం ఫత్తేపూర్ సర్పంచ్ పి అశోక్ యాదవ్, వార్డు సభ్యులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వారే కాదు మాచన్ పల్లి,టంకర గ్రామాలనుండి సైతం బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వెయ్యి మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, జిల్లా గొర్రెల కాపరులు సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, యాదిరెడ్డి, నాయకులు మైత్రి యాదయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.