12-02-2026 06:26:11 PM
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చేపల మార్కెట్ నుండి సిఐటియు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ అనంతరం రైస్ మిల్లు ఓనర్స్ అసోసియేషన్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దుచేసి, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించేంత వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు బానిసలుగా మారుస్తూ 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న కార్మికులకు అభినందనలు తెలిపారు, 2025 విద్యుత్తు సవరణ బిల్లు పేరుతో విద్యుత్తు వాడిన వినియోగదారులే విద్యుత్తు బిల్లు చెల్లించాలని నిబంధన మోడీ ప్రభుత్వం తెచ్చిందని, దీనితో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల లోపు ఉన్న గృహజ్యోతి వినియోగదారులకు ఉచిత కరెంటు అందకుండా చేస్తున్నారు.
ఇది తెలంగాణ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజి రాం జీ పేరుతో కొత్త పథకం తెచ్చి గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు, త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 4 లేబర్ కోడ్స్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని, 2025 విద్యుత్తు సవరణ బిల్లును అమలు చేయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల సిఐటియు కన్వీనర్ తాండ్ర అంజయ్య, కో.కన్వీనర్ మాతంగి రాజమల్లు, ఆపరేటర్ల సంఘం నాయకులు చారి, బండారు తిరుపతి, స్వామి సంపత్ రమేష్, కార్మిక సంఘం నాయకులు పురం హరికిషన్, భగవాన్, కొమురయ్య ,ప్రకాష్, రమేష్ ప్రశాంత్,రాజ్ కుమార్, సత్యం, లారీ డ్రైవర్లు యూనియన్ అధ్యక్షులు, పోగుల తిరుపతి, జంగ తిరుపతి, మంజూరు అంజయ్య, శంకర్ రబ్బాని, శీను, మునీర్, మజార్, కిరణ్, షమీం, వాజీజ్, ఈజాజ్, మహిళా కార్మిక అధ్యక్షురాలు అన్నపూర్ణ, రమ, శోభ, వెంకటమ్మ, విజయ, అంగన్వాడి మండల అధ్యక్షురాలు భార్గవి, శోభారాణి, వివిధ రంగాల కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.