18 April, 2026 | 12:06 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

సాయి మందిరంలో విశేష పూజలు, అన్నదానం

12-02-2026 06:21 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని సాయి మందిరంలో గురువారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గన్నా ఉపేంద్రమ్మ, వర్మ దంపతులు దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయి శర్మ, గురవయ్య, సత్యనారాయణ, హేమంత్ చౌదరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.