30 May, 2026 | 1:35 AM

ప్రమాద రహిత నగరంగా తీర్చి దిద్దుదాం

30-05-2026 12:00 AM

ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ క్రైం, మే 29 : ప్రమాద రైతు నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ అడుగులు వేద్దామని నగరం లో మైనర్ డ్రైవింగ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో సహా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించి,

మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు మరియు ప్రాణాపాయ పరిస్థితుల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైందని, చిన్న వయస్సులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు ఉన్నారు.