వర్షం వస్తే కరెంట్ గోవిందా!
- నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి
- ముందస్తు చర్యలు తీసుకుంటేనే వర్షాకాలం గట్టెకుతాం
- విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ పెంచాలంటున్న ప్రజలు
చిన్న చింత కుంట, మే 29 : వర్షం కురుస్తుంది... కరెంటు పోతుంది. ఈ సందర్భంగా ఒకటి రెండుసార్లు జరిగితే వర్షాలు కురుస్తున్నాయి కదా కరెంటు పోతుంది అనుకుంటాం. కాగా సీసీ కుంట మండల పరిధిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. గాలి వాన ఏది వచ్చిన పలు గ్రామాలలో కరెంటు వెంటనే పోతుంది తిరిగి రావాలంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని మాటలు ఫోన్లో చార్జింగ్ కూడా లేక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట.
అసలే ముందు వర్షాకాలం..
వర్షాకాలం వస్తుందంటే అంతకంటే ముందుగానే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్లను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. వేసవికాలం అంతా వృధా చేసి వర్షకాలం ఆరంభంలో విద్యుత్తు లైన్లను పరిశీలన చేస్తే ఏమి ఉపయోగం ఉంటుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్న రైతులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ చర్యలు నామమాత్రంగానే జరగడం కారణంగా కొద్దిపాటి వర్షం కురిసిన చిన్న గాలి విసిరిన చెట్లు తో పాటు వివిధ కారణాలవల్ల కరెంటు సరఫరా ఆయా గ్రామాలలో ఆగిపోతుంది. ఇకనైనా స్పందించి అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకుంటే రాబోయే వర్షాకాలం నుంచి ప్రజలకు ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉంటాయి.
సమస్యకు అసలు కారణం ఇదేనంటా
చిన్నచింతకుంట మండలానికి అమరచింతలోని 130 KV ప్రధాన విద్యుత్ కేంద్రం (సబ్ స్టేషన్) నుండి సరఫరా జరుగుతుంది. జూరాల నుండి అమరచింతకు వచ్చే లైన్లోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతుండ్రు.అమరచింత ప్రధాన కేంద్రం నుండి చిన్నచింతకుంటతో పాటు ఆత్మకూర్, మదనాపూర్ సహా మొత్తం 5 సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతుందంట.
దీంతో అమరచింత లైన్లో ఏ చిన్న సమస్య వచ్చినాఈ ఐదు సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో కరెంట్ నిలిచిపోతుందని అధికారులు చెబుతుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకొని వర్షాకాలంలో అంతరాయం లేని విద్యుత్ అందించాలని మండల వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్న మాట.






