పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
29-06-2026 12:00 AM
కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్ జూన్ 28 (విజయక్రాంతి): పోలియో రహిత సమాజానిర్మానానికి భారత ప్రభుత్వం ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం పట్టణంలోని బస్టాండ్ లో చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి వ్యాఖ్యలు ప్రారంభించారు.
5 సంవత్సరంలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో వ్యాక్సిన్ అందించాలని సిబ్బందికి సూచించారు. పోలియో వ్యాధి సోకకుండా ఈ టీకా పై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. మరో రెండు రోజుల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి మిగతా పిల్లలకు పోలిచుక్కలు వేసాలని వంద శాతం పోలియో వ్యాక్సిన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.






