పీవీ మహోన్నత మేధావి
- పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి అడ్లూరి
- పీవీ ఘాట్, గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల నివాళులు
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆ యన చిత్రపటానికి నివాళులర్పించారు. పీవీ ఘాట్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు ఇతర నేతలు ఉన్నారు.
ఇక గాంధీభవన్‌లోనూ పీవీ చిత్రపటానికి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, పార్టీ నేతలు నివాళులర్పించా రు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పీవీనరసింహారావు తెలంగాణ గడ్డకు చెందిన మహోన్నత మేధావి, దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దార్శనిక నాయకుడని కొనియా డారు.
పీవీ సేవలను చిరస్థాయిగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్య, సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. పీవీ మార్గంలోనే సమా జంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
పీవీకి సీఎం రేవంత్ నివాళులు
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రప టానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవ లను ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. పీవీ చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉన్నారు.
అసెంబ్లీ లాబీ హాల్‌లో..
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా అసెంబ్లీలోని లాబీహాల్‌లో ఉన్న పీవీ చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీవీ కూతురు, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






