మెస్సీ వరల్డ్ రికార్డ్ గోల్
29-06-2026 12:48 AM
అర్జెంటీనా దిగ్గజం అరుదైన ఘనత
డల్లాస్, జూన్ 28 : అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సి సంచలనం సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సి మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. జోరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సి ఒక గోల్ సాధించాడు. దీంతో ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక గోల్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 స్కోరుతో జోర్డాన్‌పై విజయం సాధించింది. అర్జెంటీనా తొలి భాగంలోనే రెండు గోల్స్ కొట్టింది. 80వ నిమిషంలో మెస్సి గోల్ సాధించాడు.






