18 April, 2026 | 1:33 AM

న్యాయమైన డిమాండ్లను అమలుచేయాలి

18-04-2026 12:00 AM
  1. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యాచరణ
  2. ఈ క్రమంలోనే మండల, డివిజన్ కేంద్రాల్లో వినతులు
  3. తెలంగాణ ఎంపాయీస్, టీచర్స్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనే తమ ప్రధాన ఎజెండా అని తెలంగాణ ఎంపాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీలోని భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ ఆర్డీఓ కె.రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంత రం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభు త్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యచరణకు పూనుకున్నామన్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మండల, డివిజన్ కేంద్రాలలో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలను సమర్పించాలని నిర్ణయించామన్నారు. గతం లో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనేక సమస్యల్లో కొన్నింటిని ప్రభుత్వం పరిష్కరించినప్పటికీ, దీర్ఘకాలిక సమస్యల పరిష్కా రంలో తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ప్రధానంగా జూన్2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలన్నారు.

అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయడంతో పాటు హెల్త్ కార్దులను తక్షణమే అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముం దు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయా లన్నారు. పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయాలన్నారు.

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని ప్రభు త్వాన్ని కోరారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బది లీలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్ప టికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం లో జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హన్మంతరావు, నిర్మల, దర్శన్ గౌడ్, కుమార్, ఉపేందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, హబీబ్ మియా, కృపాకర్ రెడ్డి, మొయినుద్దీన్, సీహెచ్ లక్ష్మయ్య, రాములు, రమేష్ పాక, రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.