30 March, 2026 | 5:05 AM

సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి మృతి

30-03-2026 01:45 AM

మరో ముగ్గురికి గాయాలు

ఓసీన గనిలో ప్రమాదవశాత్తు పేలిన టైరు

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జీఎం

మృతుని కుటుంబానికి రూ. 40లక్షలు చెల్లించాలని కార్మిక సంఘాల డిమాండ్

మణుగూరు, మార్చ్ 29(విజయక్రాంతి): సింగరేణి ఓసీహో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సా యంత్రం ఓసీ గనిలో పనులు నిర్వహిస్తుండగా షిఫ్టో డంపర్ (వాహనం) కు టైర్ సమస్య ఏర్పడింది. వాహనాన్ని మారుస్తుండగా ప్రమాదవశాత్తు పేలిపోయింది. దీంతో బీహార్‌కు చెందిన టైర్ ఫిట్టర్ మహమ్మద్ సర్ఫరాజ్ (40) అక్కడికక్కడే మృతిచెందా డు. సాహెబ్ లాల్ యాదవ్, జగదీష్ కుష్వా ల్, మంతూ కుమార్, తాజ్ అన్సారీలకు గా యాలయ్యాయి.

ఒక కార్మికుడిని మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలు సుకున్న ఏరియా జీఎం రామచందర్, పీకే ఓసీ ప్రాజెక్ట్ రమేష్ అధికారులతో కలిసి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. సర్ఫరాజ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే మృతిని కుటుంబాన్ని ఆదుకుంటామని హా మీ ఇచ్చారు.  కార్మికుని కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.40 లు చెల్లించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని ఏరియా కార్మి క సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాగా ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.