30 June, 2026 | 10:32 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బాలికల పాఠశాలలో లీగల్ ఎయిడ్ క్లినిక్

26-11-2025 04:49 PM

హాజరైన లీగల్ సెల్ సభ్యుడు బత్తుల గణేష్..

చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు సృజన సమక్షంలో లీగల్ టీమ్ సభ్యుడు బత్తుల గణేష్ పాఠశాలలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశారు. విద్యార్దులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్దులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన ఉండాలని, బయట సమాజంలో బాలికల పట్ల ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, అవగాహన ముఖ్యం అని అన్నారు. విద్య హక్కు చట్టం, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలు, బాల కార్మికుల చట్టాలు, బాల్య వివాహాలు, తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధులకి ఏదైనా ఇబ్బందులు ఉంటే లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా లీగల్ సర్వీసెస్ దృష్టికి తీసుకువచ్చి, సమస్యలు పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్దులు పాల్గొన్నారు.