7 August, 2026 | 9:31 PM

పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

07-08-2026 08:06 PM

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచాల కనకరాములు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి, కార్మిక శాఖ మంత్రి గడం వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఖమ్మంపల్లి సర్పంచ్ కర్ణాకర్ రెడ్డి, రాంపల్లి సర్పంచ్ బొమ్మ మల్లయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ వార్డ్ సభ్యులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని అధికారికంగా పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి గడం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులకు స్వాగతం పలుకుతూ, ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను  పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వాసరి లింగరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గజావెల్లి సుదర్శన్, బంధార గ్రామ సర్పంచ్ కొలుపుల గంగాధర్, వెలుకట్ట గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు, జాప్తి నాచారం సర్పంచ్ పావని శశిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్లకొండ రాజు, అడ్వకేట్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆరెపల్లి శ్రీనివాస్, ఖమ్మంపల్లి యువ సర్పంచ్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.