7 August, 2026 | 10:05 PM

దళితుల ఇండ్లను కూల్చొద్దు

07-08-2026 09:08 PM

- మున్సిపల్ కమిషనర్‌కు కమిషన్ ఆదేశం

చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజారు నుంచి ఆకునూరు కు వెల్లే రోడ్డు విస్తరణ పేరుతో దళితుల ఇండ్లను కూల్చివేస్తున్నారనే ఫిర్యాదుపై రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ వెంటనే స్పందించింది. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్ చేర్యాల మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

దళితుల ఇండ్ల కూల్చివేతను వెంటనే విరమించుకోవాలని కమిషనర్‌ను ఆదేశించగా, ప్రస్తుతం అలాంటి కూల్చివేత ప్రతిపాదనలు లేవని, ఎవరి ఇండ్లను కూల్చివేయబోమని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.ఈ కార్యక్రమంలో గుస్క వెంకటేశం, అంజయ్య, గునిగంటి శివతో పాటు పలువురు పాల్గొన్నారు.