బీఎల్‌వోల సేవలు అభినందనీయం
07-08-2026 09:06 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): 13వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం విజయవంతంగా పూర్తైన సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ దండు సారయ్య బీఎల్‌వోలు ఆదిలక్ష్మి, హైమావతిలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో బీఎల్‌వోలు ఆదిలక్ష్మి, హైమావతి సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. అనంతరం వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.






