చిమనగుంటపల్లిలో కారెక్కిన నేతలు
28-07-2026 12:58 AM
వనపర్తి మండలం, జులై 27: వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సోమవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.






