సమంత ‘బంగారం’ వచ్చేస్తోంది!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. నంది నీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా యి. ట్రాలాలా వవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స మంత, రాజ్ నిడిమో రు, హిమాంక్ దువ్వూ రు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర నిట్ ఈ సినిమా విడు దల తేదీని అధికారికంగా ప్రకటించింది.
వేసవి సందడి ముగిసిన తర్వాత జూన్ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చే యబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియే ట్ చేసింది. ముఖ్యంగా ‘తస్సాదియ్యా’ అనే సాంగ్ ట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తోంది. ‘ఓ బేబీ’ వంటి హిట్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాం బినేషన్‌లో వస్తున్న సిని మా కావడంతో సినీ వర్గా ల్లో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం.
సినిమాలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తున్నా రు. వీరితో పాటు శ్రీము ఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సమంత తన సొంత నిర్మాణ భాగ స్వామ్యంలో చేస్తున్న సినిమా కావడం తో ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 19న రాబోతున్న ఈ ‘బం గారం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సష్టిస్తుందో చూడాలి.






