14 May, 2026 | 3:07 AM

పంజాబ్ పరాజయాల బాట వీడేనా?

14-05-2026 02:17 AM

ముంబైతో కీలక మ్యాచ్

పేలవ ఫీల్డింగ్‌తో ఓటములు

ధర్మశాల, మే 13 : ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమైంది. హోంగ్రౌండ్  ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ అదరగొట్టింది. సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలతో దుమ్ము రేపింది.

కానీ సెకండాఫ్ వచ్చేసరికి సీన్ రివర్సయింది. భారీస్కోర్లు చేసినా ఊహించని విధంగా పరాజయాలు చవిచూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. రాజస్థాన్, గుజరాత్. సన్ రైజర్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోనూ ఓటమి పాలైంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్  11 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థా నంలో కొనసాగుతోంది. ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. 

పంజాబ్ వరుస ఓటములకు బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ఫీల్డింగ్ తప్పిదాలను కారణంగా చెప్పొచ్చు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ పంజాబ్ ఫీల్డర్లు పలు క్యాచ్‌లు వదిలేస్తున్నారు. ఫీల్డింగ్ మెరుగుపడకుంటే మాత్రం ఆ జట్టుకు ఇబ్బందు లు తప్పవు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ప్రియా న్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ , శ్రేయాస్ అయ్యర్ , స్టోయినిస్ రాణిస్తున్నారు. కూపర్ కన్నోలీ కూడా సత్తా చాటుతున్నాడు. అయి తే టాపార్డర్ ఇచ్చిన ఆరంభాలను ఒక్కోసారి తర్వాతి బ్యాటర్లు కొనసాగించలేకపోతుండడంతో అనుకున్నదాని కంటే తక్కువ స్కోరు కే పరిమితమవ్వాల్సి వస్తోంది. 

బౌలింగ్ లో మార్కో జెన్సన్ , విజయ్ కుమార్ వైశాక్‌తో పాటు ఫెర్గ్యుసన్, అర్షదీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. అయితే స్లాగ్ ఓవర్లలో పరు గులు ఇచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చాహల్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. మరోవైపు పేలవ ప్రదర్శనతో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ ఇప్పటికే నిష్క్రమించింది. రికల్టన్ నిరాశ పరుస్తుండగా.. రోహిత్ శర్మ, నమన్ ధీర్ రాణిస్తున్నారు. గత మ్యాచ్ లో బెంగళూరుపై తిలక్ వర్మ కూడా హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

ఒక్క మ్యాచ్‌లోనూ సరైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అటు మిగిలిన బ్యాటర్ల విషయానికొస్తే విల్ జాక్స్ అవకాశాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్‌లోనూ ముంబై  ఈ సారి పూర్తిగా నిరాశపరిచింది. స్టార్ పేసర్ బుమ్రా సైతం పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్లు తీయడం మరిచిపోయినట్టుగా బు మ్రా బౌలింగ్ ఉంది. మిగిలిన బౌలర్లలో శా ర్థూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కార్బిన్ బోస్చ్ రాణిస్తున్నారు. గత రికార్డులను చూస్తే ఇరు జట్ల మధ్యహోరాహోరీ పోరు నడుస్తోంది. ఇరు జట్లు 35 మ్యాచ్‌లలో తల పడితే పంజాబ్ 18 సార్లు,  ముంబై 17 సార్లు గెలిచాయి.

తుది జట్లు అంచనా 

పంజాబ్ కింగ్స్ : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయాస్ అయ్యర్, స్టోయి నిస్, సూర్యాన్ష్, మార్కో జెన్సన్, ఫెర్గ్యూసన్, అర్షదీప్ సింగ్, చాహల్, యశ్ ఠాకూర్

ముంబై ఇండియన్స్ : రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవా, కార్బిన్ బోస్చ్, శార్థూల్, దీపక్ చాహర్, ఘజన్‌ఫర్, బుమ్రా