కోహ్లీ కమాల్
శతక్కొట్టిన విరాట్
టాప్ లేపిన బెంగళూరు
ప్లే ఆఫ్స్‌కు చేరువైన ఆర్‌సీబీ
ఐపీఎల్ 19వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్నా చాలా మంది అభిమానులకు మాత్రం ఏదో వెలితి... తమ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఈ సీజన్‌లో ఇంకా అసలు సిసలు ఇన్నింగ్స్ రాలేదుగా అంటూ నిరాశ... అయితే రాయ్‌పూర్‌లో కోహ్లీ ఆ లోటు తీర్చేశాడు. మరోసారి క్లాసిక్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్‌ను అలరించిన విరాట్ సెంచరీతో దుమ్మురేపాడు. ఇప్పటికే అత్యధిక సెంచరీల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ స్టార్ క్రికెటర్ మరింత ఎత్తులో నిలిచాడు. కోహ్లీ కమాల్‌తో బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది.
రాయ్‌పూర్, మే 13: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ 8 బంతుల్లో 18 పరుగులు చేసి మం చి ఆరంభమే ఇచ్చాడు. కెప్టెన్ అజింక్య రహానే 13 బంతుల్లో 19 పరుగులు చేసి అ వుటయ్యాడు. 48 పరుగులకే కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయిన జట్టును అంగ్క్రిష్ రఘువంశీ ఆదుకున్నాడు. రఘవంశీ,- కామెరూన్ గ్రీన్ కలిసి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుం డా జాగ్రత్తగా ఆడారు.
ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 46 బంతుల్లో 68 పరుగులు చేశారు. కామెరూన్ గ్రీన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ తనదైన శైలిలో ఆడి కేకేఆర్‌ను భారీ స్కోర్ దిశగా తీ సుకెళ్లాడు. రఘువంశీతో కలిసి నాలుగో వికెట్‌కు 46 బంతుల్లో 76 పరుగులు జోడించా డు. 46 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసిన రఘువంశీ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.
రింకూ సింగ్ 29 బంతుల్లో 49( 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో కోల్‌క తా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేద నలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరం భం నుంచే దూకుడుగా ఆడింది. పిచ్ బ్యా టింగ్‌కే అనుకూలంగా ఉండడంతో బెథెల్ (15) ఔటైనా కోహ్లీ, పడిక్కల్ దుమ్మురేపారు. విరాట్‌ని ఆపడం కోల్‌కతా బౌలర్ల వల్ల కాలేదు.ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే ఛేజింగ్‌లో తిరుగులేని కోహ్లీ క్లాసిక్ షాట్లతో అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు.
హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత మరింత దూకుడు పెంచిన విరాట్ పడిక్కల్‌తో కలిసి 92 పరుగులు జోడించా డు. పడిక్కల్ (39) ఔటైన తర్వాత పటిదార్‌తో కలిసి 28, టిమ్ డేవిడ్‌తో కలిసి 23 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 9వ శతకం. చివరికి 19.1 ఓవర్లలో ఆర్‌సీబీ టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. అదే సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
స్కోరు బోర్డు
కోల్‌కతా ఇన్నింగ్స్ : 192/4 ( రఘువంశీ 71, రింకూసింగ్ 49 నాటౌట్, గ్రీన్ 39 ; భువనేశ్వర్ 1/34, హ్యాజిల్‌వుడ్ 1/35)
బెంగళూరు ఇన్నింగ్స్ : 194/4 ( కోహ్లీ 105 నాటౌట్, పడిక్కల్ 39 , బెథెల్ 15 ; కార్తీక్ త్యాగి 3/32 , నరైన్ 1/31 )






