విజిత మృతికి న్యాయవాదుల సంతాపం
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న హైకోర్టు మహిళా న్యాయవాది ఎస్. విజిత మృతి పట్ల న్యాయవాదులు, ఉద్యమకారులు, మిత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్గా పనిచేసిన విజిత తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు.
విజిత సంస్మరణ సభ 12వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన న్యాయవాదులు, మిత్రులు, జడ్జీలు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేందర్, గోవర్ధన్ రెడ్డి, ఫుడ్ కమిషన్ మాజీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదులు రఘునందన్ రెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.






