2 July, 2026 | 3:35 AM

పొలంలో ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన ఎమ్మెల్యే

02-07-2026 02:18 AM

ఎలిగేడు, జూలై 1 (విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో గల తన సొంత పొలం 3 ఎకరాలలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మూడు ఎకరాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ పంటల మార్పి డి గురించి రైతంగానికి సూచించడమే కా కుండా తానే స్వయంగా ఆయిల్ ఫామ్ తో టలను పెట్టి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

రైతులకు ఎలాంటి సమస్యలు లే కుండా అత్యధికంగా సాగు చేసే నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం అని ఆయన అన్నారు. 2.47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన నియోజకవర్గంగా పెద్దపెల్లి నిలిచిందన్నారు.

మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్రంలో ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో  31 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయడం జరిగిందని తె లిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నులయూరియాను నిల్వలు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకాఅవసరమైతే యూరియాను తెప్పిస్తామని ఆయన స్పష్టం చేశా రు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు,  కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాటల్లోనే తప్ప చేతల్లో మాత్రం రైతులకు ఎలాంటి ఉపయోగపడటం లేదన్నారు.

వడ్లు, మక్కల కొనుగోలులో రాష్ట్రానికి ఎలాంటి చేయూత అందించడం లేదని అన్నారు. దేశ ప్రజలు ఈ విషయంలో ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన అన్నారు. జిల్లా క లెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఒంటరి మహిళలకు పూర్తి సబ్సిడీతో ఆయి ల్ ఫామ్ మొక్కలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు,అగ్రికల్చర్ జిల్లా అధికారులు, తాసిల్దారు యా కన్న ,ఆయిల్ ఫార్మ్ సిబ్బంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు పాల్గొన్నారు.