calender_icon.png 6 February, 2026 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సతుల గెలుపు కోసం పతుల ఆరాటం

06-02-2026 12:56:20 AM

  1. సతులను గెలిపించి చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పతుల విశ్వ ప్రయత్నాలు 

ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పతులు 

అనుభవం ఉన్నవారికా లేక డబ్బులు ఖర్చు పెడితే చైర్మన్ పీఠమా....?

వనపర్తి, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ) : వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా వార్డులో ప్రచారాలు జోరు అందు కున్నాయి. ఉదయం నుండే ఆయా పార్టీల తరుపున బలపర్చిన అభ్యర్థులు, స్వంత్రత అభ్యర్థులు ఎక్కడ తగ్గకుండా తమ తమ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. తమను గెలిపిస్తే వార్డు అన్ని వార్డుల కంటే మన వార్డును ముందు వరుసలో నిలుపుతామని ప్రజలకు హామీలను ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

సతుల గెలుపు కోసం పతుల ఆరాటం

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ పీఠం దాదాపు 22 సంవత్సరాల తరువాత మహిళ రిజర్వేషన్ కావడం పట్ల త్రీవ ఉత్కంఠత నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అటు సతి, ఇటు పతి ఫోటీలో నిల బడాలని తమ వార్డు లో పనులు చేసుకుం టూ వచ్చారు. ఒక్కసారిగా చైర్మన్ పీఠం మహిళ రిజర్వేషన్ రావడంతో ఎవరికీ ఒకరికే పార్టీ టికెట్ అనడంతో చైర్మన్ స్థానంలో ఉండాలని అనుకునే పతులంతా తమ సతులకు టికెట్లను ఇప్పించుకున్నట్లు సమాచా రం.

ఇక్కడి వరకు బాగానే ఉన్న చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే ముందుగా ఆయా వార్డులో తమ సతులను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతం లో హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఉన్న వారిని ఓట్ల కోసం పిలిపించుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో నేడు రాష్ట్రము లో కాకుండా ఆంధ్ర ప్రాంతం అయిన కర్నూల్ లో ఉన్న వారిని సైతం పిలిపించి వారికీ రానుపోను ఖర్చులు తామే భరిస్తాం రావాలంటూ నాయకులు వేడుకుంటున్న సందర్భాలు ఉన్నాయంటూ ప్రజలు బహిరంగా చర్చించుకుంటున్నారు. 

 ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పతులు 

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో అధికార, ప్రతి పక్ష పార్టీల తరుపున చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది అధికారంకంగా ప్రకటించకున్నప్పటికి మహిళా అభ్యర్థులు ఉన్న వార్డు లోని ప్రజలకు తమకు పెద్ద నాయకుల మద్ద త్తు తమకే ఉందని మనమే చైర్మన్ అంటూ తమను గెలిపించాలని వార్డు లోని ప్రజలను ప్రాధేయ పడుతున్నారు.

బయటకు ఆయా పార్టీల నాయకులు ఒకరిని ఒకరు కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళను ఓడగోడితే మా చైర్మన్ స్థానానికి ఇబ్బందులు ఉండవంటూ ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులను వేస్తున్నట్లు సమాచారం.

మొద టి సారి ఎన్నికల బరిలోకి వచ్చి చైర్మన్ పీఠం ఎక్కుతాం అంటే ఎవరు ఊరుకోరని మేము ఎందులో తక్కువ ఇప్పటికే పలు మార్లు కౌన్సిలర్లుగా చేసిన అనుభవం ఉన్న మాకే చైర్మన్ పీఠం దక్కుతుందని వారికీ వారే త మ ధీమాను వ్యక్తం చేసుకుంటున్నట్లు సమాచారం. 

 అనుభవం ఉన్నవారికా లేక డబ్బులు ఖర్చు పెడితే చైర్మన్ పీఠమా? 

మున్సిపాలిటీ చైర్మన్ పీఠం అంటే తమ వార్డుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసే బాధ్యతలు ఉంటాయి. అలాంటి భాద్యతలు కలిగిన చై ర్మన్ పీఠంను అనుభవం కలిగిన కౌన్సిలర్ల కు ఇస్తేనే వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని అలా కాదని కేవలం డబ్బు లు ఖర్చు పెట్టె వాళ్లకు చైర్మన్ పీఠం దక్కితే అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారు అవుతుందని, చైర్మన్ పీఠం అనుభవం ఉన్నవారికా లేక డబ్బులు కురిపించే వారికా వేచి చూడాలని వనపర్తి పట్ట ణ ప్రజలు, మేధావులు, యువత బహిరంగాననే చర్చించుకుంటున్నారు.