13 April, 2026 | 6:36 PM

వడ్డేర సంఘ భవనానికి భూమి కేటాయించాలి

13-04-2026 05:16 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలో వడ్డేర కులస్తులకు సంఘ భవన నిర్మాణం కోసం అర ఎకరం భూమి కేటాయించాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వడ్డేర కులస్తులు సోమవారం భారీ ఎత్తున తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. హలో వడ్డేర – చలో మల్లాపూర్ అనే నినాదాలతో కార్యాలయానికి తరలివచ్చిన వారు స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు వంద దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ వడ్డేర కులస్తుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు మండల కేంద్రంలో సంఘ భవనం అవసరమని, ప్రభుత్వం వెంటనే భూమి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

అదేవిధంగా మల్లాపూర్ మండల వడ్డేర సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అల్లేపు నరేష్ (మల్లాపూర్),ఉపాధ్యక్షుడిగా అల్లేపు గౌతమ్ (సిర్పూర్), ప్రధాన కార్యదర్శిగా అలకుంట రాజశేఖర్ (రాఘవపేట్), ప్రచార కార్యదర్శిగా మక్కల రాజేష్ (వేంపెల్లి వెంకట్రావుపేట) ఎన్నికయ్యారు. కార్మిక శాఖ అధ్యక్షుడిగా కుంచపు నవీన్ (వేంపెల్లి వెంకట్రావుపేట), ఉపాధ్యక్షుడిగా బోసు పాపయ్య (మల్లాపూర్), కార్యదర్శిగా గోగుల నరేష్ (గుండంపల్లి), కార్యదర్శులుగా అలకుంట మహేష్ (రాఘవపేట్), చిన్నారెడ్డి (దాంరాజ్‌పల్లి), కోశాధికారిగా ఓర్స్ మహేష్ (సిర్పూర్) ఎన్నుకోబడ్డారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల వడ్డేర సంఘం నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.