13 April, 2026 | 6:36 PM

రక్తదానం చేసిన పెంచికల్‌పేట్ ఉపాధ్యాయులు

13-04-2026 05:12 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెంచికల్‌పేట్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు రక్తదానం చేసి సేవా స్పూర్తి చాటారు. బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతులు, టీఎస్‌యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఉపాధ్యాయుల సేవను అభినందిస్తూ, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంలో వారు మార్గదర్శకులని పేర్కొన్నారు. వీరి సేవలకు గుర్తింపుగా రావూజీ, డా.సునీత,ఎ వెంకట్, జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఊశన్న, జిల్లా కార్యదర్శి ఎం రాజకమలాకర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సాయికుమార్, తిరుమల్ గౌడ్, రమాకాంత్, మల్లన్న, కిషోర్ పాల్గొని రక్తదానం చేశారు.