శభాష్ నాగినెని.. మంత్రి శ్రీధర్‌బాబు
నాడు ముత్తారంలో కాలేజీకి.. నేడు ఇందిరమ్మ ఇండ్లకు భూవిరాళం
ముత్తారంలో పేదోళ్లకు అండగా నాగినేని
సొంత భూమి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి
మంత్రి శ్రీధర్ బాబుతో భూమి పూజ
ముత్తారం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): శభాష్ నాగినెని... అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. ముత్తారం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు ముత్తారం మండల కేంద్రంలో నాడు ప్రభుత్వ కాలేజీకి సొంత భూమి విరాళంగా ఇచ్చి, నేడు ఇందిరమ్మ ఇండ్ల కు ముత్తారంకు చెందిన నిరుపేద కుటుంబాలకు తన సొంత భూ మిని ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో భూమి పూజ కూడా చేయించారు.
ప్రభుత్వ కాలేజీకి భూమి విరాళంగా ఇచ్చి కాలేజీ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించి, అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇందులేని నిరుపేదలకు తన సొంత భూమి విరాళంగా ఇచ్చిన నాగినేని ని మంత్రి శ్రీధర్ బాబు శభాష్ నాగినేని అని అభినందించారు. నాగినేని లాంటి వ్యక్తులను ఇతరులు ఆదర్శంగా తీసుకొని పేదలకు అండగా ఉండి ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని మంత్రి సూచించారు. అలాగే నాగినేని ని ముత్తారం మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.






