30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

నాలా సమస్యల పరిష్కారానికి కసరత్తు

15-04-2026 12:06 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 13(విజయక్రాంతి):  జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ పరిధిలో ఉన్న నాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి నాలా ప్రభావిత ప్రాం తాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ముఖ్యంగా షేక్పేట్ లక్ష్మీ నగర్ నాలాలో మురుగు, చెత్త పేరుకుపోవడం వల్ల ఏర్పడుతున్న సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే, వెంటనే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు చేపట్టి నాలా ప్రవాహం సక్రమంగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం షేక్పేట్ హరి జనవాడలో జరుగుతున్న మట్టి లిఫ్టింగ్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల సౌకర్యం దృష్ట్యా ప్రతి పనిలోనూ సమయపాలన పాటించాలని అధికారులకు సూచించారు.

షేక్పేట్ ఫ్లైఓవర్ కింద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పోరట్స్ కాంప్లెక్స్ పనులను కూడా సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. షేక్పేట్ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.