కాంగ్రెస్ పటిష్టతకు నూతన అధ్యక్షులు కృషి చేయాలి
ఘట్ కేసర్, జూలై 7 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నూతనంగా నియమితులైన డివిజన్ అధ్యక్షులు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ లోని వజ్రేష్ యాదవ్ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన బొక్క ప్రభాకర్ రెడ్డి కి జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేదల అభివృద్ధి ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతుందన్నారు. సందర్భంగా ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నామీద ఎంతో నమ్మకంతో డివిజన్ అధ్యక్షులుగా నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, తో పాటు సహకరించిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.






