24 August, 2026 | 10:29 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత

08-07-2026 12:05 AM

నాగిరెడ్డిపేట్, జులై 7 (విజయక్రాంతి): మండలంలోని వదల్పర్తి గ్రామంలో పూరి గుడిసెలు నివసించే నిరుపేద కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా వదలపర్తి గ్రామంలో 11 ఇండ్లు మంజూరయ్యాయని గ్రామ సర్పంచ్ సత్య బోయిన పద్మ నారాయణ తెలిపారు.లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టా పత్రాలను గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్, గ్రామ కార్యదర్శి అశోక్,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.