8 July, 2026 | 1:00 AM

ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ

08-07-2026 12:07 AM

నాగిరెడ్డిపేట్, జులై 7 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామం ఐకెపి రుణాలలో అత్యధిక ఓవర్ డ్యూ ఉన్న గ్రామంగా అధికారులు గుర్తించారు.ఈ సందర్భంగా మంగళవారం తాండూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఐకెపి రుణాలపై రికవరీ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి స్థానిక ఎమ్మార్వో బిక్షపతి,శ్రీనిధి ఆర్‌ఎం కిరణ్ పాల్గొన్నారు.

సమావేశంలో ఓవర్ డ్యూ సభ్యుల వివరాలను శ్రీనిధి ఆర్‌ఎం కిరణ్ వివరించి, శ్రీనిధి ద్వారా సభ్యులకు అందుతున్న వివిధ రుణాలు,సేవలు మరియు ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు.

అనంతరం స్థానిక ఎమ్మార్వో బిక్షపతి మాట్లాడుతూ... శ్రీనిధి, బ్యాంక్ లీకేజ్ మరియు ఇతర స్వయము సహాయక సంఘాల రుణాలను చెల్లించని సభ్యులపై అవసరమైతే రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి మొండి బకాయిలు ఉన్న సభ్యులు వెంటనే తమ రుణాలను చెల్లించి చట్టపరమైన చర్యలకు గురికాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదగౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్,ఏపిఎం కొమ్మ దత్తు,సీసీ నజీర్, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల, గ్రామ సంఘం అధ్యక్షురాలు లింగమ్మ, వివోఏ ప్రవీణ,తదితరులు పాల్గొన్నారు.