8 May, 2026 | 12:11 AM

జూన్ 6న మలేషియాకు కేటీఆర్

08-05-2026 12:00 AM
  1. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు
  2. విస్తృత ఏర్పాట్లు చేస్తున్న బీఆర్‌ఎస్ ప్రతినిధులు

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యం లో బీఆర్‌ఎస్ మలేషియా ప్రతినిధులు మారుతి కుర్మా, చిట్టిబాబు, శ్రీధర్, ప్రియా తదితరు లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.

ఈ ఆహ్వానాన్ని కేటీ ఆర్ స్వీకరించి, జూన్ 6న మలేషియాలో జరి గే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నట్టు ధృవీకరించారు. తెలంగాణ , తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఈ చారిత్రాత్మక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ మలేషియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.