5 July, 2026 | 3:03 AM

అలరించిన సాంస్కృతిక ప్రదర్శన

05-07-2026 12:00 AM

శేరిలింగంపల్లి, జూలై 4 (విజయక్రాంతి): మాదాపూర్ శిల్పారామంలో ఎత్నిక్ హాల్లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భా గంగా భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు శనివారం ప్రేక్షకులను ఎంతగానో అల రించాయి. హత్య గురువులు నిత్య మనంద రం శిష్యులు అన్వి, శ్రీనిక, తేజస్విని, ప్రియం, అనన్య, లక్ష్మీసహస్రలు రంగపూజ, పుష్పాంజలి, ముద్దుగారే యశోద, గణేశ కౌత్వం, మామవతు శ్రీ సరస్వతి, వంటి భరతనాట్య అంశాలను అందంగా ప్రదర్శించారు.

జాతీయ మేధోపరమైన వైకల్యం ఉన్న వ్యక్తు ల సాధికారత సంస్థ నుంచి తేజస్విని, సాహి తి, మనస్విని, శ్రీకరి, యజ్ఞేశ్లు ‘స్వాగతం కృష్ణ’నటరాజ స్తోత్రంతో మెప్పించారు. ప్రాచి శిష్యులు ప్రియాల్, దివ్యశ్రీ, ఆరోహి, సంజన, అధ్య, అడ్వికాలు కథక్లో తరణ, కృ ష్ణ కవిత, గణేష్ వందన, రాజ్ జోగ్ అంశాలను చక్కగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం సంప్రదాయ కళలను ప్రోత్సహించడంతో పాటు వైకల్యం ఉన్న కళాకారుల సృజనాత్మకతను ప్రదర్శించింది.