19 June, 2026 | 4:27 AM

గ్రామంలో నివసించే వారికే ఓటు హక్కు

19-06-2026 01:49 AM

ఓటర్ జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి

బీఎల్వోలు, బీఎల్‌ఏలకు అవగాహన సదస్సులో ఆర్డీవో పార్థసారథి రెడ్డి

మొయినాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): మొయినాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో గురువారం ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్వో లు (BLOలు), బీఎల్‌ఏలు (BLAలు) కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఆర్డీవో పార్థసారథి రెడ్డి, మొయినాబాద్ తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ హాజరై ఎన్నికల నిబంధనలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించా రు. ఈ సందర్భంగా ఆర్డీవో పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కా ర్యక్రమంలో భాగంగా జూన్ 24 నుంచి జూ లై 25 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలని, ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.

గ్రామాల్లో నివ సించే వారికే గ్రామంలో ఓటు హక్కు ఉండే లా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెళ్లైన మహిళలు తమ నివాస ప్రాంతానికి అనుగుణంగా ఓటు హక్కును బదిలీ చేసుకోవాలని సూచించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎల్వోలకు సూచించారు.

తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, బీఎల్వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. కొ త్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చే ర్పులను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుం డా ఓటర్ల పేర్లను తొలగించరాదని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ ల నాయకులు, మండలంలోని అన్ని గ్రామా ల బీఎల్వోలు, బీఎల్‌ఏలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.