23-02-2026 09:06:02 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల గ్రామ పంచాయతీ కార్మికుల సిఐటియు అనుబంధ సంఘం అధ్యక్షులుగా కొండ సైదులు గౌడ్ ఎన్నికయ్యారు. మండలంలోని అప్పన్నపేట గ్రామంలో యూనియన్ మండల మహాసభ రావుల వెంకన్న అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
సిఐటియు అనుబంధ యూనియన్ నూతన కమిటీ అధ్యక్షులుగా కొండ సైదులు, ప్రధాన కార్యదర్శిగా అమరవరపు శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నట్లు సిఐటియు జిల్లా నాయకులు షేక్ యాకూబ్ తెలిపారు.మొత్తం ఎనిమిది మందితో నూతన కమిటీని ఎన్నికైనట్టు ఆయన ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కొండ సైదులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.