calender_icon.png 24 February, 2026 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు

23-02-2026 08:59:39 PM

చిట్యాల,(విజయక్రాంతి): అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి వాహన డ్రైవర్ ఓనర్ పై కేసు నమోదు చేశామని చిట్యాల ఎస్ఐ తెలిపారు. సోమవారం చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారి 65పై పోలీసులు తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వహించగా అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనం టీఎస్ 29 టీ 3458 నెంబర్ గల వాహనాన్ని తనిఖీ చేస్తుండగా కోదాడ నుండి చిట్యాల మీదుగా హైదరాబాద్ కు పశువులను తరలిస్తున్న వాహనంలో తొమ్మిది ఆవులను దగ్గర దగ్గరగా ఊపిరాడకుండా కబేలాకు  తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని గుర్తించి, బొలెరో డ్రైవర్ షేక్ జానీ పాషాను మరియు అతని ఓనర్ వేముల అనిల్ కుమార్ లపై కేసు నమోదు చేశారు. వాహనంలోని ఆవులను సేఫ్ కస్టర్డ్ నిమిత్తం గోశాలకు తరలించామని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.