calender_icon.png 23 February, 2026 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సహాయం అందజేత

23-02-2026 09:09:01 PM

విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు దాతృత్వం

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన నిరుద్యోగి పోలంపల్లి దాన వీర అనే యువకుడికి పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సేకు వెంకటేశ్వర్లు వరలక్ష్మి దంపతులు సోమవారం రూ.10,116లు ఆర్థిక సాయం అందజేశారు. పాత ఆటో కొనుగోలు చేసుకొని, స్వయం ఉపాధి పొందే నిమిత్తం పోలంపల్లి దాన వీరకు ఆర్థిక సాయం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, సేకు సాయిరాం, రమ్య , నాగ సంయుక్తరాణి పాల్గొన్నారు.