calender_icon.png 6 February, 2026 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటు

06-02-2026 09:08:15 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మెడికల్ అసోసియేషన్ శుక్రవారం ఎన్నికలు జరిగాయి. దీనికి రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ నేరెళ్ల ప్రమోద్, నిర్మల్ జిల్లా కోశాధికారి బద్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శేఖర్, ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షునిగా కే రాము, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి ఎం ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కామోజీ శ్రీనివాస్, సుతారి మహేందర్ ,జావీద్ ,జాయింట్ సెక్రెటరీ రాం వంశీ, వెంకటేష్ గౌడ్, తదితరులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.