06-02-2026 09:11:06 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధి యాప్రాల్లో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ వో సైదయ్య తెలిపిన కథనం ప్రకారం... యాప్రాల్ ప్రాంతంలోని ఓ వైన్సాప్ సమీపంలో నిస్సాహాయస్థితిలో మగవ్యక్తి పడి ఉన్నాడని స్థానికులు 100కు డయల్ చేసి చెప్పారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు పరిశీలించగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. చనిపోయిన వ్యక్తి సుమారు 50-55ఏళ్ళ మధ్య వయసు కలిగి ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించారు. వివరాలకు అడ్మిన్ ఎస్సై రాము 8712662103 సంప్రదించాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.