25 June, 2026 | 1:18 AM

ముగ్గురు మహిళలతో ఎఫైర్స్ నిజమే!

25-06-2026 12:10 AM
  1. అమెరికన్ కాంగ్రెస్ ప్యానెల్ విచారణలో బిల్‌గేట్స్ ఒప్పుకోలు
  2. ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేశాడని వ్యాఖ్యలు

న్యూయార్క్, జూన్ ౨౪: ముగ్గురు మహిళలతో తనకు ఎఫైర్స్ ఉన్న మాట వాస్తవమే నని మైక్రోసాఫ్ట్ కో--ఫౌండర్ బిల్ గేట్స్ స్ప ష్టం చేశారు. అమెరికన్ హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఈనెల 10న నిర్వహించిన క్లోజ్డ్‌డోర్ విచారణ వేదికగా ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. అయితే.. ఈ వాస్తవా లన్నీ ఆలస్యంగా చూస్తున్నాయి. అమెరికన్ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్ర కారం.. బిల్‌గేట్స్ తనకు బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, న్యూక్లియర్ ఫిజిసిస్ట్ కరిమా నిగ్మతులీనాతో ఎఫైర్ ఉండేదని, వారిద్దరూ రష్యన్లనేనని వెల్లడించారు.

అలాగే, మూడో మహిళ మెడికల్ ఎంటర్‌ప్రెన్యూర్ అలిస్ జా కబ్స్ నెస్సెల్‌రోడ్ అని తెలిపారు. ఈ ముగ్గురితో ఎఫైర్స్‌ను ఆసరా చే సుకుని ఎప్‌స్టీన్ తన ను బ్లాక్ మెయిల్ చేసే వాడని, అయితే.. ఆ బ్లాక్ మెయిల్ నేరుగా ఉండేది కాదని పరోక్షంగా ఉండేదని కమిటీ కి వివరించారు. అయితే.. తన ఎఫైర్స్‌కు ఎప్‌స్టీన్‌తో ఫైల్స్ నేరాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబాన్ని ఎఫై ర్స్ ఎంతో బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు ఎఫైర్స్ ద్వారా లైంగిక సంక్రమణ వ్యాధులు (ఎస్టీడీ) వచ్చాయనే అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నా లుగేళ్ల కాలంలో తాను ఎప్‌స్టీన్‌ను 12-14 సార్లు కలిశానని, రెండుసార్లు వీడియో కా ల్స్ మాట్లాడినట్లు వివరించారు. సామాజిక కార్యక్రమాల నిర్వహణ అంశంపై చర్చించేందుకే తాను ఎప్‌స్టీన్‌ను కలిశానని, అంతక మించి తమ మధ్య ఏమీ లేదని తెలిపారు.