29 April, 2026 | 10:50 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

పదవ తరగతి ఫలితాల్లో కేజీవీబీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ

29-04-2026 09:04 PM

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో తిరుమలాయపాలెం మండలంలోని కేజీవీబీ, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆరు సబ్జెక్టులపై వార్షిక పరీక్షలు నిర్వహించగా విద్యార్థులకు సమగ్రంగా సిద్ధం అయ్యేలా సమయం కల్పించారు.

మండలంలోని నాలుగు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 591 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 554 మంది ఉత్తీర్ణత సాధించారు. జల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మేకల జ్ఞానేశ్వరి 581 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానం జిల్లాలో రెండో స్థానం సాధించింది. పిండిప్రోలు ప్రభుత్వ పాఠశాలకు చెందిన బోడ భరత్ 577 మార్కులతో మండల ద్వితీయ స్థానంలో నిలిచాడు. తేట్టెలపాడు, మాదిరిపురం పాఠశాలలు శాతం వంద ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు నామవరపు బాబు, దారా రాజేష్, విజయకుమారి, కే రమకుమారి, వీరస్వామి, మధుసూదన్, గోపాలరావు, కృష్ణమోహన్, సీతారాంరెడ్డి అభినందించారు.