3 April, 2026 | 12:34 PM

బిక్కనూర్ నేత ఇంద్రకరణ్ రెడ్డికి కీలక బాధ్యతలు

03-04-2026 10:39 AM

బిక్కనూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్ఠానం బిక్కనూర్ మండలం రామేశ్వరపల్లికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని(Bikkunur Leader Indrakaran Reddy) అసెంబ్లీ కోఆర్డినేటర్గా నియమించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఖానాపూర్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం, నాయకత్వ సమన్వయం, కేడర్‌ను సమర్థవంతంగా నడిపించడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధిష్ఠానం తెలిపింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని పేర్కొంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.