3 April, 2026 | 1:48 PM

Breaking News

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •   కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్   •   Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ   •   సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం... గ్రూప్-1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట   •  

కలెక్టర్ ఆదేశాలు బే ఖాతర్

03-04-2026 12:08 PM

ఇసుక అక్రమ తవ్వకాలు..

జోరుగా సాగుతున్న అక్రమ రవాణా. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరు మండలం చంద్రవంచ వాగులో(CHANDRA VANCHA VAGU) అనుమతులు ఏవి లేకుండా ఇసుక తవ్వకాలు(Illegal Sand Mining) జరుగుతున్నాయి. యదేచ్ఛగా అక్రమార్కులు అక్రమ రవాణా కూడా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత మైన్స్, రెవెన్యూ పోలీస్ ధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం సంబంధిత కాంట్రాక్టర్ అనుమతి తీసుకున్నాడు. అయితే ఇదే అదనుగా అనుమతులు ఓ చోటికి తీసుకొని మరోచోటికి ఇసుక రవాణా చేస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. అక్రమ రవాణా, తవ్వకాలకు అడ్డుకోవాల్సిన అధికారులు  అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.

ఇటీవల కలెక్టర్ దీపక్ తివారి(Collector Deepak Tiwari) ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు పాల్పడుతున్న వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని. .వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. అయినా కూడా అక్రమార్కులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో హిటాచి లాంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ భారీ టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తూ యదేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై తాండూర్  తాసిల్దార్ తారా సింగ్ ను వివరణ కోరగా చంద్రవంచలో చెక్ డాం నిర్మాణం, కోట్పల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ఏప్రిల్ ఫస్ట్ వరకు మాత్రమే అనుమతులు ఉన్నాయని  అనుమతులు లేకుండా తవ్వకాలుగాని రవాణా గాని చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాలు జప్తు చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.