పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు సృష్టించాలి
ఘట్ కేసర్,(విజయక్రాంతి): స్వీయ క్రమశిక్షణ, కష్టించే తత్వం, సమయపాలన, పట్టుదల విలువలతో కూడిన జీవితం తాము ఎంచుకున్న లక్ష్యానికి సునాయాసంగా చేరుస్తాయని విద్య వైజ్ఞానిక పారిశ్రామిక టెక్నాలజీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. దివ్య నగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరిశ్రమలు, విద్యాసంస్థల ఐఐఆర్ఎం-2026 సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ప్రారంభమైన కార్యక్రమం గురువారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు ఎక్స్ పో ను సందర్శించిన నిపుణులు విద్యార్థుల సృజనాత్మకతను, నైపుణ్యాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పరిశ్రమల అవసరాలు మీద చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను గురించి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా టెక్-మహేంద్ర వైస్ ప్రెసిడెంట్ మల్లాది నాగార్జున మాట్లాడుతూ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, సమయపాలన ఎంతో ముఖ్యమన్నారు. పెండమెంటల్స్ ను వదల వద్దని నాయకత్వ లక్షణాలను పెంపొందిoప జేసుకోవాలన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల ఫైనల్ డిస్కర్షన్ కు అధ్యక్షత వహించారు. విద్యార్థులకు అవసరమైన విషయాలు పరిశ్రమల దృక్పథం తెలియజేయడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గరుడ అనాలటిక్స్ సీఈవో డాక్టర్ విఎస్ఎస్ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఎల్ అండ్ టి కి చెందిన సంతోష్, తదితరులు విద్యార్థులకు తమ అమూల్యమైన సలహాలను అందించారు.




