అర్హులందరికీ సంక్షేమ పథకాలు
03-04-2026 10:45 AM
-కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 55 డివిజన్లో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి పాలన కార్యక్రమం కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, వికలాంగు పింఛను, జీరో కరెంట్ బిల్లు,500 గ్యాస్ బండ, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందని వారు ప్రతి కుటుంబం ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాధిక, ఎలక్ట్రిసిటీ ఏఈ, . రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వార్డు ఆఫీసర్ నాగరాజు, డివిజన్ జవాను నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




