ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్యా రవి కుమార్ నాయక్
ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎలక్షన్లలో గెలుపొందిన వారీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎన్నికల అధికారి దంతాల ఆనంద్ , ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా భూక్య రవికుమార్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ గా వల్లభనేని అరుణ ,జనరల్ సెక్రెటరీగా షేక్ మహమ్మద్ ఖాసిం , జాయింట్ సెక్రటరీగా సిహెచ్ నవీన్ కుమార్ , ట్రెజరీగా సపవట్ బన్సీలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు . ఈసందర్భంగా ప్రెసిడెంట్ B. రవి కుమార్ నాయక్ గారు మాట్లాడుతూ న్యాయవాదులకు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరిని సమన్వయం చేసుకుంటూ,న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రణాళిక బద్దంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.




