3 April, 2026 | 12:40 PM

కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గంగల రవీందర్ నియామకం

03-04-2026 10:42 AM

భిక్కనూర్,(విజయ క్రాంతి): సమాచార హక్కు రక్షణ చట్టం (RTI) అమలుకు కృషి చేసే సంస్థలో కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గంగల రవీందర్‌ను నియమించారు. రాష్ట్ర కమిటీ ప్రతినిధి సిహెచ్ సుధాకర్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గంగల రవీందర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించి, వారి హక్కులను సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో కామారెడ్డి జిల్లా స్టూడెంట్ కన్వీనర్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.