పోలీసింగ్‌కు సాంకేతికతే కీలకం
- భవిష్యత్ సవాళ్లకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉండాలి
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జాతీయ పోలీసు సదస్సు
- కపిలవాయి దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహణ
ముషీరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సామాజిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించాలని హర్యానా మాజీ గవర్నర్, జాతీయ పోలీసు సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ బండారు దత్తాత్రేయ అన్నారు. లక్ష్యం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన జాతీయ పోలీసు సదస్సులో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ, లక్ష్యం చారిటబుల్ సొసైటీ చైర్మన్ కపిలవాయి దిలీప్‌కుమార్ సదస్సును సమన్వయం చేశారు.
భారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోంకార్యదర్శి, పద్మభూషణ్ కె పద్మనాభయ్య పోలీసింగ్‌లో సాంకే తికతను నిరంతరం ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. హర్యానా హోంశాఖ అద నపు ప్రధానకార్యదర్శి సుధీర్‌రాజ్‌పాల్, ఐఏఎస్ పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయవ్యవ స్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దుర్గా ప్రసాద్, ఐపీఎస్(రిటైర్డ్) పోలీసు ఖాళీపోస్టులను ఎప్పటిక ప్పుడు భర్తీచేయాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్రకుమార్ అక్కడ పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లను వివరించగా, హిమాచల్‌ప్రదేశ్ మాజీ డీజీపీ సంజయ్ కుండు దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్న సమయంలో సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి చేసి న కృషిని ప్రశంసించారు.
తమిళనాడు మాజీ డీజీపీ ఎం.డి. షకీల్ అక్తర్ పెద్దఎత్తున పోలీసు నియామకాలు, ఖైదీలపునరావాసానికి ప్రాధా న్యం ఇవ్వాలని సూచించారు. మాజీ డీజీపీ సి. గోపీనాథ్‌రెడ్డి జైళ్లను సంస్కరణ, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. అరుణ బహుగుణ, ఐపీఎస్ (రిటైర్డ్) పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఫోరెన్సిక్ నిపుణులు రామమోహన్ నేరపరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రాధా న్యాన్ని వివరించారు. ఎస్పీ నరసింహరెడ్డి పోలీసులకు నిరంతరశిక్షణ, సంక్షేమానికి ప్రాధా న్యం ఇవ్వాలని కోరారు.
సీనియర్ అడ్వకేట్, మాజీ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ శరత్ నేర దర్యాప్తు, ఛార్జ్‌షీట్ల తయారీలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ భారత వైమానిక దళ పైలట్, లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ మాజీ అధికారి మాల్కమ్ వోల్ఫ్ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు క్రమశిక్షణ, డ్రైవింగ్ శిక్షణపై అవగాహన అవసరమన్నారు. సదస్సులో చర్చించిన అంశాలు, సిఫార్సులను క్రోడీకరించి కేంద్ర హోంమంత్రికి సమర్పించనున్నట్లు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వీసీ సజ్జనార్, ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషన ర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






